మసాలా కిచిడీ
- August 19, 2015
కావాల్సిన పదార్ధాలు
బియ్యం, పెసరపప్పు - ఒక కప్పు చొప్పున
నెయ్యి - ఒక కప్పు
బఠానీలు - ఒక కప్పు
క్యారెట్, బీన్స్, టొమాటో ముక్కలు - అరకప్పు చొప్పున
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
తాలింపు కోసం
అవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఇంగువా, గరం మసాలా సరిపడినంత తీసుకోవాలి.
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని, పెసరపప్పును కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని, దానిలో రెండు కప్పుల నీళ్లు పోసి, అదే గిన్నెలో తరిగిన కూరగాయ ముక్కలను కూడా వేసి కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. ఇప్పుడు వేరొక బాణలిలో తాలింపు సామాన్లు అన్నీ వేసి, పచ్చి మిర్చి, అల్లం తరుగు వేసి వేగాక ఉప్పు, కారం, గరం మసాలా వేసి కొత్తిమీర తరుగు కూడా వేసి మంట తగ్గించాలి.తరువాత దీనిలో ముందుగా వండి పెట్టిన పెసరపప్పు అన్నం వేసి బాగా కలిపి, దానిలో మరికొంచెం నీళ్లు పోసి కొద్ది సేపు ఉడికించాలి. కాసేపటికి ఇది కిచిడీలా తయారవుతుంది. అంతే మసాలా కిచిడీ రెడీ.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







