సైకిళ్ళపై పెట్రోలింగ్‌ని ప్రారంభించిన పోలీస్‌

- October 20, 2016 , by Maagulf
సైకిళ్ళపై పెట్రోలింగ్‌ని ప్రారంభించిన పోలీస్‌

అబుదాబీ పోలీసులు, సైకిల్‌ పెట్రోల్‌ టీమ్స్‌ని పునరుద్ధరించాయి. రెసిడెన్షియల్‌ మరియు కమర్షియల్‌ ప్రాంతాల్లో ఈ సైకిల్‌ పెట్రోల్‌ టీమ్స్‌ తమ సేవల్ని సమర్థవంతంగా నిర్వహించనున్నాయి. త్వరలో ఈ సేవల్ని మరింతగా విస్తరిస్తామని అబుదాబీ పోలీస్‌ వర్గాలు వెల్లడించాయి. పూర్తిస్థాయిలో ఎక్విప్‌మెంట్‌తో కూడిన పెట్రోల్‌ టీమ్‌ సైకిల్స్‌పై విదులను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అబుదాబీ పోలీస్‌ చీఫ్‌ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ మొహమ్మద్‌ ఖల్ఫాన్‌ అల్‌ రుమైతి మాట్లాడుతూ, అబుదాబీ పోలీసులు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారనీ, సొసైటీలో భద్రత అలాగే శాంతికి కట్టుబడి ఉన్నామని అన్నారు. నేరాల్ని తగ్గించడంలో ఈ సైకిల్‌ పెట్రోల్‌ టీమ్స్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని వివరించారాయన. 'వి ఆర్‌ ఆల్‌ పోలీస్‌', 'హార్స్‌ నైట్స్‌' వంటి విభిన్నమైన కార్యక్రమాలతో అబుదాబీ పోలీసులు ప్రజలకు మరింత చేరువవుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com