అరామ్కో ఆయిల్ కంపెనీ వద్ద గాయపడిన ఇరువురు కార్మికులు మృతి
- October 21, 2016
రియాద్ సమీపంలో అరామ్కో ఆయిల్ కంపెనీ లో ఇటీవల జరిగిన ఒక అగ్నిప్రమాదంలో పలువురు కార్మికులు గాయపడగా అందులో ఇరువురు కార్మికులు గురువారం చనిపోయినట్లు సంబంధిత యాజమాన్యం తెలిపింది. ముడి చమురు సేకరించే అరామ్కో కంపెనీ వద్ద బుధవారం సాయంత్రం 3 గంటలప్పుడు పలువురు కార్మికులు పని చేస్తున్నసమయంలో అకస్మాత్ముగా అలవీసా ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదకారణంగా పలువురు కార్మికులు గాయపడ్డారు. కాగా ప్రస్తుతం వారికి చికిత్స చేస్తున్నారని తీవ్రంగా గాయపడిన ముగ్గురు కార్మికులలోఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతుండగా వారిలో ఇరువురు గురువారం మరణించారని అందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు ట్విట్టర్ ఖాతాలో గురువారం కంపెనీ ఒక పోస్ట్ పెట్టింది. దీని కారణంగా సంస్థ యొక్క కార్యకలాపాలపై ఏమాత్రం ప్రభావం లేదని తెలిపారు. 17 మంది కింగ్ అబ్దుల్ అజిజ్ మెడికల్ సిటీ ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. కాగా చనిపోయినవారి గురించి ఎటువంటి వివరాలు ఆ పోస్ట్ లో తెలియచేయలేదు. గత సెప్టెంబర్ లో జరిగిన అరామ్కో యొక్క గల్ఫ్ తీరం రాస్ తానురా ఆయిల్ టెర్మినల్ మంటలు చెలరేగి ఒక అగ్నిప్రమాదంలో ఎనిమిదిమంది కార్మికులు గాయపడ్డారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







