స్వర్ణ పతాకం కైవసం చేసుకున్న భారత్ ఆర్మీ
- October 22, 2016
పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాదంపై పోరాటంలోనే కాదు అంతర్జాతీయ మిలిటరీ పోటీల్లోనూ మాకు మేమే సాటి అని భారత సైన్యం నిరూపించింది. సైన్యంలోని గూర్ఖా రైఫిల్స్ బృందం ప్రపంచంలోనే అత్యంత కఠిన సవాళ్లతో కూడుకొన్న కాంబ్రియన్ ప్యాట్రోల్ ఎక్సర్సైజ్లో స్వర్ణ పతకం సాధించింది. బ్రిటిష్ ఆర్మీ ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తారు. 8 గూర్ఖా రైఫిల్స్‌లోని రెండో బెటాలియన్‌కు చెందిన 8 మంది సభ్యుల బృందానికి పతకాలు అందిస్తున్న వీడియోను వేల్స్‌లోని బ్రిటిష్ ఆర్మీ ట్వీట్ చేసింది. 'కాంబ్రియన్ ప్యాట్రోల్‌లో స్వర్ణ పతకం గెలుచుకొన్న 8 గూర్ఖా రెండో బెటాలియన్ బృందానికి అభినందనలు. మీ ప్రతిభ అసాధారణం.. అద్భుతం' అని బ్రిటిష్ ఆర్మీ పేర్కొంది. వేల్స్‌లోని గరుకైన, ఎగుడు దిగుడు రాళ్లతో ప్రమాదకరంగా ఉండే కాంబ్రియన్ పర్వతాల్లో ఈ అంతర్జాతీయ పోటీని ఏటా నిర్వహిస్తారు. ప్రపంచంలోని అత్యంత కఠినమైన ప్యాట్రోల్ ఎక్స్‌ర్‌సైజుల్లో ఇదొకటి. పోటీపడే బృందం మొత్తం 55 కిలోమీటర్లు పూర్తిచేయాల్సి వుంటుంది. పోటీ పడే బృందానికి చెప్పిన అన్ని పనుల్ని తప్పకుండా చేయాలి. అదీ 48 గంటల్లోనే. పోటీదారులు వారి వ్యక్తిగత కిట్లను ఎవరికి వారే తెచ్చుకోవాలి. వివిధ సైనిక పోటీల్లో ప్రదర్శనను బట్టి పాయింట్లు ఇస్తారు. ఎవరైనా కిట్లు కోల్పోతే వారు అంతే బరువు మోస్తూ రావాలి. అయినా సరే పాయింట్లలో కోత విధిస్తారు. యుద్ధ నైపుణ్యం, డ్రిల్స్‌ను దాటేయడం, ప్రథమ చికిత్స ప్రక్రియ, విమానాలు, వాహనాలు, సామగ్రిని గుర్తించడం, డ్రిల్స్‌లో పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేయడం, యుద్ధ ఖైదీల నిర్వహణ, హెలీకాప్టర్ డ్రిల్స్, మీడియాతో సంబంధాలు, రేడియో కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఇలాంటివి పోటీలో ఉంటాయి. పాయింట్లను బట్టి స్వర్ణం(75 శాతం), రజతం (65-74%), కాంస్యం (55-64%), 55 శాతం కన్నా తక్కువ పాయింట్లు లభించిన వారికి సర్టిఫికెట్లు అందజేస్తారు.
తాజా వార్తలు
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!







