భారత్‌, పాక్‌ మధ్య యుద్ధం కొట్టిపారేయలేమన్న సుబ్రమణ్యన్‌ స్వామి...

- October 23, 2016 , by Maagulf
భారత్‌, పాక్‌ మధ్య యుద్ధం కొట్టిపారేయలేమన్న సుబ్రమణ్యన్‌ స్వామి...

యూరి ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రయిక్ దాడి నేపథ్యంలో భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు యుద్ధ వాతావరణం నెలకొన్ని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా శనివారం స్పందించారు.భారత్‌, పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నప్పటికీ అవి యుద్ధానికి దారితీస్తాయని తాను భావించడం లేదని ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. న్యూయార్క్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. యుద్ధం జరగకూడదని రెండు దేశాల ప్రభుత్వాలు జాగ్రత్తపడుతున్నాయన్నారు.కాశ్మీర్‌లో జరుగుతున్న ఆందోళనలకు ముగింపు కనుచూపు మేరలో కనబడట్లేదన్నారు.ఇదే కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నాయకుడు సుబ్రమణ్యన్‌ స్వామి కూడా పాల్గొన్నారు. భారత్‌లో పాక్‌ కళాకారులపై నిషేధం విధించాలన్న డిమాండుకు మద్దతు పలికారు. భారత్‌, పాక్‌ మధ్య యుద్ధం జరిగే సూచనలను కొట్టిపారేయలేమన్నారు.యూరి ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రయిక్ దాడి నేపథ్యంలో భారత్ -పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు యుద్ధ వాతావరణం నెలకొన్ని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా శనివారం స్పందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com