గల్ఫ్‌కు పరారైన కాల్ సెంటర్ స్కామ్ ప్రధాన సూత్రధారి...
- October 23, 2016
కోట్లాది రూపాయల థానే కాల్ సెంటర్ స్కామ్ ప్రధాన సూత్రధారి సాగర్ థక్కర్ అలియాస్ షాగ్గీ దేశం విడిచి పరారయ్యాడు. ఓవైపు థానే క్రైం బ్రాంచ్ పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్న సమయంలోనే థక్కర్ గుట్టుచప్పుడు కాకుండా దేశం నుంచి ఉడాయించాడు. ఈనెల 5న అతను దేశం విడిచి పారిపోయినట్టు అధికారులు తెలిపారు. థానే జిల్లాలోని మీరారోడ్‌లో నకిలీ కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి పన్ను ఎగ్గొట్టినట్లుగా తమ మాటలతో అమెరికన్లను మభ్యపెట్టి వారి నుంచి వందల కోట్లు కొల్లగొట్టిన ఉదంతం ఇటీవల బయటపడటం సంచలనమైంది. దీంతో పలు కాల్సెంటర్లపై పోలీసు బృందాలు ఈనెల 4-5 తేదీల్లో దాడులు నిర్వహించాయి. 70 మంది డైరెక్టర్లు, అసోసియేట్లను అరెస్టు చేసి, 700 మంది ఉద్యోగులను అదుపులోనికి తీసుకున్నారు.
పట్టుబడిన వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో థక్కర్ వ్యవహారం బయటపడింది. అప్పటికే అతను దేశం విడిచివెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఈనెల 7న థక్కర్‌పై 'లుక్ అవుట్ సర్క్యులర్'ను పోలీసులు జారీ చేశారు. థక్కర్ దుబాయ్ పారిపోయినట్టుగా అనుమానిస్తున్నారు.
కాగా, విచారణలో థక్కర్ పెద్ద సోదరి రీమా థక్కర్ కూడా ఈనెల 8న న్యూఢిల్లీ నుంచి దేశం విడిచి పారిపోయినట్టు వెల్లడైంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







