అరికాళ్లను మసాజ్ ద్వారా ఒత్తిడులను అధికమించవచ్చు..!
- October 23, 2016
నిత్య జీవితంలో నేడు ప్రతి ఒక్కరు మానసిక ఒత్తిడికి లోనవుతున్న విషయం అందరికీ విదితమే. శరీరంలో జరిగే క్రియలకు, అరికాళ్లకు అవినాభావ సంబంధం ఉంది. ప్రతిరోజు అరికాళ్లను మసాజ్ చేసుకోవడం ద్వారా ఈ ఒత్తిడులను అధికమించవచ్చు. మసాజ్ చేసుకునే ముందు అరికాళ్లను ముందుగా చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. నాలుగైదు చుక్కల నూనెతో మెల్లగా మర్దన చేయాలి. రెండుమూడు వేళ్లతో కండరాల మీద ఒత్తిడి చేస్తూ మసాజ్ మొదలెడితే మంచిది. వీలైనంత వరకు బొటన వేలితో ఒత్తిడిని పెంచాలి. ఈ మసాజ్ వల్ల శరీరంలో అనుకోని మార్పులు జరిగి సత్వరమే రిలాక్సేషన్ లభిస్తుంది. శరీరంలోకి కొత్త శక్తి వచ్చి చేరుతుంది. ఈ మసాజ్ వల్ల కండరాల్లో అక్కడక్కడ ఏర్పడిన బ్లాకేజీలు తొలగి, రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. శక్తి శరీరమంతా వ్యాపిస్తుంది.దైనందిన జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బిగుతుగా ఉండే సాక్సులు, షూస్ వేసుకోవడం వల్ల అరికాళ్లకు గాలి తగలదు. ఒట్టి కాళ్లతో నేల మీద నడిచేందుకు వీలుండదు. తద్వార రక్తప్రసరణ సరిగా సాగదు. కాబట్టి షూష్ ఎక్కువగా వేసుకునే వాళ్లు వారానికి మూడుసార్లు అయినా కాళ్లను మసాజ్ చేయించుకుంటే మంచిది అని నిపుణులు చెపుతున్నారు. శరీరంలో రక్తప్రసరణ సాఫీగా సాగితే ఎన్నో దీర్ఘకాలిక జబ్బులు దరి చేరవు. మహిళలు గర్భం దాల్చినప్పుడు కాళ్ల వాపులు సహజం. ఎక్కువ దూరం నడవకపోవడం వల్ల కాళ్ల నొప్పులు మొదలవుతాయి. వాపులు ఎక్కువయ్యే కొద్దీ ఇతరత్రా సమస్యలు వస్తాయి. ఇటువంటి వాళ్లు రోజూ పడుకునేప్పుడు పదిహేను నిమిషాల పాటు అరికాళ్లకు మసాజ్‌లు చేయించుకుంటే ఉత్తమం. డిప్రెషన్, యాంగ్జయిటీ, స్ట్రెస్.... ఇవన్నీ మెల్లగా మనిషి ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసే జబ్బులు. వీటిని తగ్గించుకోవటానికి రిలాక్సేషన్ టెక్నిక్‌లు అనుసరించాలి. ఈ టెక్నిక్స్‌లో అద్భుత ఫలితాలనిస్తుంది ఫుట్ మసాజ్. దీనివల్ల మానసిక ఆందోళన తగ్గుతుంది. ప్రశాంతత లభిస్తుంది.మెనోపాజ్, పిఎంఎస్ సమస్యలు అనేకం. ఉన్నట్లుండి మూడ్ మారిపోవడం, చికాకు, కోపం, తలనొప్పి, ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి ఇవన్నీ పట్టుకుంటాయి. ఈ సమస్యలతో బాధపడేవాళ్లు.. ఫుట్ మసాజ్‌ను ఆశ్రయించొచ్చు. రోజూ చేసుకుంటే సమస్యలు కొంతవరకు తగ్గుతాయనడంలో సందేహం లేదు. ఆఫీసులో పని ఒత్తిడి, లక్ష్యాల వల్ల ఆందోళన, ఒత్తిడి కలుగుతుంటుంది. వేళకు తినకపోవడం, జంక్‌ఫుడ్‌ను ఆశ్రయించడం, జీర్ణశక్తి తగ్గడం వంటి అనేక రకాల సమస్యల వల్ల అధిక రక్తపోటు వస్తుంది. రోజుకు కనీసం పది నిమిషాల పాటు ఫుట్ మసాజ్ చేసుకుంటే అధిక రక్తపోటు ద్వారా వచ్చే సమస్యలను అధిగమించవచ్చు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







