మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ..!
- October 23, 2016
మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 18మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఏవోబీలో మావోయిస్టుల కీలక సమావేశాలు జరుగుతున్నట్లు సమాచారంతో మల్కాన్ గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పనసపుట్టు వద్ద ఆంధ్రా గ్రేహౌండ్స్-ఒడిశా ఎస్ ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. అయితే పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరపటంతో ప్రతిగా పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 18మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో భారీ పెద్దన పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.బలిమెల రిజర్వాయర్ లోని ఓవోబీ కటాఫ్ ఏరియాలో ఈ ఆపరేషన్ జరిగింది.ఎన్ కౌంటర్ లో కీలక నేత మల్లేశ్ చనిపోయినట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి మావోయిస్టు అగ్రనేత ఆర్కే పరారైనట్లు సమాచారం. అలాగే తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు ఇద్దరు గ్రేహౌండ్స్ పోలీసు కానిస్టేబుల్స్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా విశాఖకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







