క్యామియో రోల్‌లో కనిపించడం పెద్ద మిస్టేక్‌ : రాజమౌళి

- October 24, 2016 , by Maagulf
క్యామియో రోల్‌లో కనిపించడం పెద్ద మిస్టేక్‌ :  రాజమౌళి

'బాహుబలి' మొదటి భాగంలో రాజమౌళి ఓ చోట కనబడతాడు. జక్కన్న చేసిన క్యామియో రోల్‌ సినిమాలో బాగా పేలింది. అయితే రెండో భాగంలో కూడా కనబడతారా అన్న ప్రశ్నకు రాజమౌళి ఇలా స్పందించాడు. 'మొదటి భాగంలో నేను క్యామియో రోల్‌లో కనిపించడం పెద్ద మిస్టేక్‌. ఒక్కసారి మిస్టేక్‌ చేసేశాక మరోసారి దాన్ని రిపీట్‌ చేయకూడదు. అందుకే రెండో భాగంలో నేను కనిపించన'ని చెప్పాడు. 'మహాభారతం' సినిమా తీయడానికి తనకు మరో పదేళ్ల అనుభవం కావాలని.ప్రస్తుతానికి తన ఆలోచనలన్ని బాహుబలి పై మాత్రమే ఉన్నాయన్నాడు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com