నవంబర్ 4న విడుదల కానున్న 'పిల్ల రాక్షసి'

- October 24, 2016 , by Maagulf
నవంబర్ 4న విడుదల కానున్న 'పిల్ల రాక్షసి'

బిచ్చగాడు` వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి అందిస్తున్న మరో చిత్రం పిల్ల రాక్షసి. మలయాళంలో ఘన విజయం సాధించిన `ఆన్ మరియ కలిప్పిలాను` తెలుగులో `పిల్ల రాక్షసి` పేరుతో నవంబర్ 4న విడుదల చేస్తున్నారు. `బిచ్చగాడు` చిత్రానికి తెలుగులో మాటలు, పాటలు అందించిన రచయిత భాషాశ్రీ మలయాళ చిత్రం `ఆన్ మరియ కలిప్పిలాను` తెలుగు అనువాదానికి మాటలు, పాటలు అందించారు. ఓ ఫ్రాడ్‌స్టర్‌తో చిన్నారి చేసిన సావాసం ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే కాన్సెప్ట్ తో రూపొందిన సినిమానే పిల్ల రాక్షసి. ఈ సినిమా ఆడియో, ట్రైలర్ లు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ మూవీలో `ఓకే బంగారం` ఫేం దుల్కర్ సల్మాన్ ఓ ముఖ్య అతిధిగా నటించగా, సారా అర్జున్‌ టైటిల్ పాత్రలో నటించింది.

సన్ని వాయ్‌నే, అజు వర్గీస్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.a

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com