అక్టోబర్6,2017 నుంచి ఫుట్‌బాల్ వరల్డ్‌కప్
- October 25, 2016
భారత్ తొలిసారిగా అంతర్జాతీయ ఫుట్‌బాల్ కప్ ఛాంపియన్‌షిప్‌నకు ఆతిథ్యమివ్వబోతోంది. 2017లో అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ఇక్కడ జరగనుంది. అక్టోబర్ 6 నుంచి 28 వరకు మ్యాచ్‌లు జరుగుతాయని ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య ఫిఫా ఈ రోజు ప్రకటించింది. మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఇప్పటికే ఐదు వేదికలను ఎంపిక చేసిన ఫిఫా బృందం.. చివరిదైన ఆరో వేదిక కోసం నేడు కోల్‌కతాలో పర్యటించి ఆమోదం తెలిపింది. ఇక్కడి మౌలిక వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆరు వేదికల్లో ఏ మ్యాచ్ ఎక్కడ జరగనుందనే వివరాలను జులై 7న వెల్లడించనున్నారు. .
కోల్‌కతాలోని స్టేడియంలో 75 నుంచి 80 శాతం పనులు పూర్తయ్యాయని..
జనవరి 31 వరకు స్టేడియంను సిద్ధం చేస్తామని పశ్చిమ్‌బంగా క్రీడల శాఖ మంత్రి ఆరూప్ బిశ్వాస్ తెలిపారు. ఇప్పటికే కొచ్చి, ముంబయి, గువహటి, దిల్లీ, మార్గావ్(గోవా) నగరాలను ఫిఫా బృందం పరిశీలించి మ్యాచ్‌ల నిర్వహణకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









