వైవాహిక జీవితం విచ్చిన్నం కాకుండా రంభ ప్రయత్నాలు..
- October 26, 2016
టాలీవుడ్ లో ఒకప్పడు టాప్ హీరోయిన్ గా ఉన్న రంభ వివాహ తర్వాత మూవీలకు దూరంగానే ఉంది.. తాజాగా ఆమె వైవాహిక జీవితం ఒడిదుడుకుల్లో పడింది. 2010 ఏప్రిల్ లో శ్రీలంకకు చెందిన ఇందిరన్ పద్మనాథన్ ను రంభ వివాహం చేసుకుంది. భర్త కెనడాలో సెటిలైన బిజినెస్ మేన్. భర్తతో కలిసి టోరంటోలో నివసించిన రంభకు 5, 19 నెలల ఇద్దరు కూతుళ్లున్నారు. కొన్ని నెలల నుంచి భార్యాభర్తలిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. వారిద్దరి మధ్య గొడవకి కారణాలేంటో బయటికి రాలేదు. తాజాగా రంభ బీటలు పడ్డ తన వివాహబంధాన్ని నిలబెట్టాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. హిందూ మ్యారేజ్ యాక్ట్ లోని సెక్షన్ 9 ప్రకారం తాను భర్తతో నివసించేలా చేయమని అభ్యర్థించింది. డిసెంబర్ 3న ఈ కేసుపై విచారణ జరుగుతుంది. వైవాహిక జీవితం విచ్చిన్నం కాకుండా రంభ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







