సమాజ సమస్యలు ప్రతిబింబించేలా పూరీ ...
- October 27, 2016
సినిమా వినోద సాధనమైనా. కొంతైనా సార్థకత ఉండాలన్నది విజ్ఞుల మాట. సార్థకత అంటే ప్రజలకో, సమాజానికో పనికొచ్చే ఓ మంచి మాట చెప్పడం. సంఘాన్ని మార్చేలా, సమాజ సమస్యలు ప్రతిబింబించేలా కథను చూపించడం. సినిమా వల్ల ఒక్కరు మారినా ఆ ప్రభావం కొన్నేళ్లలో పెద్ద మొత్తమే అవుతుంది. మంచి మార్పునకు బాటలు వేస్తుంది. ఇటీవల తన సినిమాలతో అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్.
పూరీ తొలినాళ్ల దర్శకత్వ ప్రయాణమంతా ఫాంటసీ కథల మీదే నటించింది. ఈ ప్రయాణంలో కొద్ది కొద్దిగా పరిపక్వత చెందాడు. 'బద్రి', 'బాచీ' సమయానికి తను ఎంచుకున్న కథలకు 'అమ్మా నాన్న తమిళ అమ్మయి', '143' లాంటి నేపథ్యాలకు భావోద్వేగాలు మోతాదు పెంచాడు.
ఈ ఆలోచననా విధానం మరింతగా మారుతూ వచ్చింది. మాఫియా నేర సామ్రాజ్యం, దాని ఆటకట్టించే పోలీసుల సాహసాలు, సమాజంపై మాఫియా ప్రభావం ఇలాంటివి పూరీ కథల్లో చేరాయి. 'పోకిరీ' అలా తయారైన సినిమానే.
సోషల్ యాంగిల్ తో సినిమాలు చేయడం ప్రారంభించాక.మళ్లి తన వెనకటి తరహా సినిమాలకు వెళ్లలేకపోయాడు పూరీ. తను సమాజంలో చూస్తున్న సంగతులు, వ్యక్తిగతంగా తనకు ఎదురైన పరిస్థితులు ఇవన్నీ కథలుగా క్యారెక్టర్లుగా రాసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీ బాధలు తెలిసిన వాడుగా 'నేనింతే' చేశాడు. మనిషిని నమ్మి మోసపోయిన తన గతం సాక్షిగా 'బిజినెస్ మేన్ ' రూపొందించాడు. చిన్నప్పటి నుంచి చలం సాహిత్యాన్ని చదివిన ప్రభావంతో 'జ్యోతిలక్ష్మి' తెరకెక్కించాడు. దశాబ్దాలు, శతాబ్దాలు గడిచినా మహిళా లోకంలో వచ్చిన శాశ్వత అభివృద్ధి ఏంటని ప్రశ్నించాడు. తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంగా పవన్ కళ్యాణ్ తో 'కెమెరా మెన్ గంగతో రాంబాబు' తెరపైకి తీసుకొచ్చాడు.
పూరీ జగన్నాథ్ సంధించిన తాజా అస్త్రం 'ఇజం'. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించారు. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు విదేశాల్లో దాచుకున్న నల్లధనం అంశాన్ని ప్రస్థావించాడు పూరీ. ఓ పరిశోధక పాత్రికేయుడు లక్షల కోట్ల విలువైన నల్లధనాన్ని పేద ప్రజలకు చేర్చే కలను చూపించాడు. ఇది వర్తమానంలో సాధ్యం కాకపోయినా.ఇలా జరిగితే బాగుంటుందనే ఆశను కలిగించాడు. పదిమందికి ఉపయోగపడని జర్నలిజం చదువు ఎందుకని ప్రశ్నించాడు. ఇలా వర్తమానాంశాలపై తన భావ స్రవంతిని కమర్షియల్ అంశాల మేళవింపుతో తనకున్న రచనా పాటవంతో సినిమాలుగా చేస్తున్నాడు పూరీ.
తాజా వార్తలు
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్‌వర్క్ ఆవిష్కరణ..!!









