12 మంది బబ్బర్‌ ఖల్సా ఉగ్రవాదుల చొరబాటు

- October 27, 2016 , by Maagulf
12 మంది బబ్బర్‌ ఖల్సా ఉగ్రవాదుల చొరబాటు

 దేశంలో పెద్దయెత్తున ఉగ్రదాడులు జరిపేందుకు బబ్బర్‌ ఖల్సా గ్రూపుకు చెందిన ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. దాదాపు 12 మంది ఉగ్రవాదులు పంజాబ్‌లోకి అక్రమంగా ప్రవేశించారని, వీరు ఉత్తర భారతదేశంలో దాడులు చేసేందుకు యత్నించే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీచేశాయి. దీంతో పంజాబ్‌లో హైఅలర్ట్‌ను ప్రకటించారు. ఈనెల 23న పంజాబ్‌లో అనుమానిత ఉగ్రవాది కమల్‌దీప్‌ సింగ్‌ని విచారించగా ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఐబీ అధికారులు తెలిపారు.

ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించేందుకు 12 మంది పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు.
ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలతో పంజాబ్‌ రాష్ట్ర డీజీపీ... సీనియర్‌ పోలీసు అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సరిహద్దు ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com