ప్రభుత్వ భవన సముదాయానికి నేడు శంకుస్థాపన ..
- October 27, 2016
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో మరో బృహత్తర ఘట్టానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణానికి శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణúజైట్లీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. 950 ఎకరాల్లో భవనాల నిర్మాణానికి రూ.5600 కోట్లు అవసరమవుతాయని అంచనా. రాష్ట్ర సచివాలయం, శాసనసభ, మండలి భవనాలు, రాజ్‌భవన్, ముఖ్యమంత్రి నివాస భవనం, ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు, మంత్రులు, అధికారులు, ఉద్యోగుల నివాసగృహాలు వంటివన్నీ ప్రభుత్వ భవనాల సముదాయంలో భాగంగానే నిర్మిస్తారు.
2018 డిసెంబరు నాటికి భవనాల నిర్మాణం కొలిక్కి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
మరో కీలక ఘట్టం: రాజధాని నిర్మాణానికి 2015 జూన్ 6న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు భూమిపూజ నిర్వహించారు. 2015 అక్టోబరు 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించారు. 2016 ఫిబ్రవరి 17న తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేశారు. హైదరాబాద్‌లోని సచివాలయాన్ని ఇక్కడికి తరలించారు. ఇప్పుడు శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం రాజధాని నిర్మాణంలో కీలక ఘట్టం.
ప్రభుత్వం సన్నాహాలు: ప్రభుత్వ భవనాల సముదాయ పనులను త్వరగా మొదలుపెట్టేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. దీనికి బృహత్ ప్రణాళిక రూపకల్పనలో భాగంగా ప్రధాన భవన నిర్మాణ శిల్పిని ఎంపిక చేసేందుకు మంగళవారం టెండర్లు పిలిచింది. రెండు మూడు నెలల్లో ఆకృతులు ఖరారు చేసి నిర్మాణాలు మొదలు పెట్టనుంది. మరో పక్క వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విశ్వవిద్యాలయాలకూ భూములు కేటాయించింది. విట్ విశ్వవిద్యాలయం నవంబరు 3న, ఇండో-యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థ ఆస్పత్రి నిర్మాణానికి నవంబరు 7న శంకుస్థాపన చేయనున్నాయి. రాజధానిలో 2018 డిసెంబరునాటికి పూర్తి చేయాల్సిన పనులకు సంబంధించి ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించుకుంది.
యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు: తుళ్ళూరు మండలం లింగాయపాలెం సమీపంలో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.35 నిమిషాలకు దాని శంకుస్థాపనతో పాటు రిజర్వుబ్యాంకు ప్రాంతీయ కార్యాలయం, విజయవాడలో మురుగునీటి పారుదల వ్యవస్థ, గుంటూరులో భూగర్భ డ్రైనేజీ నిర్మాణంతోపాటు రాజధానిలో ఏడు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి విజయవాడ నుంచి హెలికాప్టంú ద్వారా సభాస్థలికి చేరుకుంటారు. గురువారం సాయంత్రం మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు సభావేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. రాజధాని గ్రామాల రైతులందరికీ సీఆంúడీఏ వ్యక్తిగతంగా ఆహ్వానాలు పంపింది. ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటుచేసింది.
పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న జైట్లీ: కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అమరావతిలో అధికారిక కార్యక్రమాలతో పాటు భారతీయ జనతా పార్టీ ఏర్పాటుచేసే సదస్సులోనూ పాల్గొంటారు. ఉదయం 11.45కు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా భాజపా శ్రేణులు నిర్వహించే కార్యశాలకు హాజరవుతారు. అనంతరం విజయవాడ గేట్‌వే హోటల్‌కు చేరుకుంటారు. జైట్లీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుల గౌరవార్థం ముఖ్యమంత్రి విందు ఏర్పాటు చేస్తున్నారు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో దిల్లీకి ప్రయాణమవుతారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







