దుబాయ్‌ మెట్రో రైడ్‌తో 50,000 దిర్హామ్‌లు గెల్చుకోవచ్చు

- October 27, 2016 , by Maagulf
దుబాయ్‌ మెట్రో రైడ్‌తో 50,000 దిర్హామ్‌లు గెల్చుకోవచ్చు

దుబాయ్‌: సొంత వాహనాన్ని విడిచి, దుబాయ్‌ మెట్రోలో ప్రయాణిస్తే, 50,000 దిర్హామ్‌లు గెల్చుకునే అవకాశం ఉంది. రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ, దుబాయ్‌ వాసులకు నవంబర్‌ 1వ తేదీన పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డేని సెలబ్రేట్‌ చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా 100,000 దిర్హామ్‌లు ఇద్దరు విజేతలు గెల్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంటే ఒక్కో విజేత 50,000 దిర్హామ్‌లు గెలుచుకోవచ్చన్నమాట. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీన్స్‌ని ఎక్కువగా వినియోగిస్తున్నవారి నుంచి ఇద్దరిని ఎంపిక చేసి, బహుమతులు అందజేస్తామని పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీ సీఈఓ మరియు హెడ్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌డే కమిటీ - ఆర్‌టిఎ యూసుఫ్‌ అల్‌ అలి చెప్పారు. మెట్రో, ట్రామ్‌ మరియు పబ్లిక్‌ బస్‌లు, అలాగే మెరైన్‌ ట్రిన్సిట్‌ మోడ్స్‌ (వాటర్‌ బస్‌, వాటర్‌ ట్యాక్సీ)లకు కూడా ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. 'స్కావెంజర్‌' హంట్‌ పేరుతో మరో కాంటెస్ట్‌ని కూడా నిర్వహిస్తున్నారు. ట్రాన్స్‌పోర్ట్‌ డే ఫెస్టివిటీస్‌ సందర్భంగా ఆర్‌టిఎ 50 మంది బెస్ట్‌ డ్రైవర్స్‌ని అలాగే ఫ్రాంచైజ్‌ కంపెనీ ఆపరేటర్లను సన్మానించనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com