దుబాయ్ మెట్రో రైడ్‌తో 50,000 దిర్హామ్‌లు గెల్చుకోవచ్చు
- October 27, 2016
దుబాయ్: సొంత వాహనాన్ని విడిచి, దుబాయ్ మెట్రోలో ప్రయాణిస్తే, 50,000 దిర్హామ్‌లు గెల్చుకునే అవకాశం ఉంది. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, దుబాయ్ వాసులకు నవంబర్ 1వ తేదీన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డేని సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా 100,000 దిర్హామ్‌లు ఇద్దరు విజేతలు గెల్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంటే ఒక్కో విజేత 50,000 దిర్హామ్‌లు గెలుచుకోవచ్చన్నమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీన్స్‌ని ఎక్కువగా వినియోగిస్తున్నవారి నుంచి ఇద్దరిని ఎంపిక చేసి, బహుమతులు అందజేస్తామని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ సీఈఓ మరియు హెడ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్డే కమిటీ - ఆర్టిఎ యూసుఫ్ అల్ అలి చెప్పారు. మెట్రో, ట్రామ్ మరియు పబ్లిక్ బస్‌లు, అలాగే మెరైన్ ట్రిన్సిట్ మోడ్స్ (వాటర్ బస్, వాటర్ ట్యాక్సీ)లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. 'స్కావెంజర్' హంట్ పేరుతో మరో కాంటెస్ట్ని కూడా నిర్వహిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ డే ఫెస్టివిటీస్ సందర్భంగా ఆర్టిఎ 50 మంది బెస్ట్ డ్రైవర్స్‌ని అలాగే ఫ్రాంచైజ్ కంపెనీ ఆపరేటర్లను సన్మానించనుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







