'చిన్ని రామయ్య' గా కల్యాణ్ రామ్

- October 29, 2016 , by Maagulf
'చిన్ని రామయ్య' గా కల్యాణ్ రామ్

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం ఇజం థియేటర్లలో సందడి చేస్తుంది. పటాస్ మూవీ తర్వాత సరైన హిట్ లేక బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న రామ్‌కి పూరీ జగన్నాథ్ చెప్పిన స్టోరీ నచ్చడంతో ఈ సినిమాకు ఓకే అనేశాడు. ఇజం అనే టైటిల్ తో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించగా, కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా రికార్డులు సాధించింది. ఇక ఇదే ఉత్సాహంతో వెంటనే మరో పిక్చర్ కు ప్లాన్ చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం డైరెక్టర్ రమేష్ వర్మతో కల్యాణ్ రామ్ కథా చర్చలు జరుపుతుండగా ఈ సినిమాకి 'చిన్ని రామయ్య' అనే టైటిల్ ఫిక్స్ చేసారని చెబుతున్నారు. కె.కె. రాధామోహన్ నిర్మించనున్న ఈ చిత్రంకు సంబంధించిన మిగతా నటీ నటుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్టు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com