'చిన్ని రామయ్య' గా కల్యాణ్ రామ్
- October 29, 2016
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం ఇజం థియేటర్లలో సందడి చేస్తుంది. పటాస్ మూవీ తర్వాత సరైన హిట్ లేక బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న రామ్కి పూరీ జగన్నాథ్ చెప్పిన స్టోరీ నచ్చడంతో ఈ సినిమాకు ఓకే అనేశాడు. ఇజం అనే టైటిల్ తో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించగా, కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా రికార్డులు సాధించింది. ఇక ఇదే ఉత్సాహంతో వెంటనే మరో పిక్చర్ కు ప్లాన్ చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం డైరెక్టర్ రమేష్ వర్మతో కల్యాణ్ రామ్ కథా చర్చలు జరుపుతుండగా ఈ సినిమాకి 'చిన్ని రామయ్య' అనే టైటిల్ ఫిక్స్ చేసారని చెబుతున్నారు. కె.కె. రాధామోహన్ నిర్మించనున్న ఈ చిత్రంకు సంబంధించిన మిగతా నటీ నటుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







