అదరగొడుతున్న 'శాతకర్ణి' న్యూలుక్

- October 29, 2016 , by Maagulf
అదరగొడుతున్న 'శాతకర్ణి' న్యూలుక్

నందమూరి నటసింహం బాలకృష్ణ తన అభిమానులకు దీపావళీ కానుకను అందించాడు. 'సమయం లేదు మిత్రమా.. శరణమా? రణమా?' అంటూ దసరా పండుగకు టీజర్ ద్వారా అభిమానులను అలరించిన బాలకృష్ణ మరోసారి 'శాతకర్ణి' సినిమా ఆసక్తిని పెంచే ఓ చిత్రాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఆసక్తినిరేకెత్తిస్తున్న ఈ ఫోటోలో బాలకృష్ణ కత్తదూస్తూ ఆవేశంగా కనిపిస్తున్నాడు. టీజర్‌ విడుదలైనప్పటి నుంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న వారిఆసక్తిని మరింత పెంచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com