దుబాయ్ టు మంగుళూరు - స్పైస్‌జెట్ డైరెక్ట్ ఫ్లైట్
- October 30, 2016
భారతదేశంలో బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌గా ప్రయాణీకుల ఆదరాభిమానాల్ని చూరగొన్న స్పైస్‌జెట్, దుబాయ్ - మంగుళూరు మధ్య డైరెక్ట్ ఫ్లైట్‌ని అనౌన్స్ చేసింది.ఈ లాంచింగ్ కార్యక్రమములో కంట్రీ హెడ్ వినయ్ నంబియార్ కేక్ కట్ చేసారు.ప్రతిరోజూ ఈ డైరెక్ట్ ఫ్లైట్ ప్రయాణీకులకు సేవలందించనుంది. ఇంట్రడక్షన్ ఆఫర్ కింద కేవలం 308 అరబ్ ఎమిరేట్స్ దినార్స్‌తో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. బోయింగ్ 737 విమానాల్ని ఇందుకోసం స్పైస్‌జెట్ వినియోగించనుంది. మంగళూరు నుంచి దుబాయ్‌కి వెళ్ళే విమానం ప్రతిరోజూ ఉదయం 0.20 గంటలకు టేకాఫ్ అవుతుంది. దుబాయ్ - మంగళూరు విమానం మంగళ, బుధ, గురు, శుక్ర మరియు ఆదివారాల్లో మధ్యాహ్నం 12.55 గంటలకు, సోమ మరియు శనివారాల్లో ఉదయం 3.40 నిమిషాలకు టేకాఫ్ అవుతుంది. స్పైస్‌జెట్‌కి సంబంధించినంతవరకు ఆరు విదేశీ డెస్టినేషన్స్‌లో దుబాయ్ ఒకటి. భారతదేశంలో పది డెస్టినేషన్స్‌కి స్పైస్‌జెట్ నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసుల్ని ఇప్పటికే నిర్వహిస్తోంది. అహ్మదాబాద్, అమృత్సర్, ఢిల్లీ, జైపూర్, కోచి, కోజికోడ్, మధురై, ముంబై, పూణె మంగళూరు నగరాలకు ఈ విమానాలు అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







