బస్సు దారులను ఉల్లంఘనలకు రేపట్నుంచి 600 డి హెచ్ చెల్లించాలి

- October 31, 2016 , by Maagulf
బస్సు దారులను ఉల్లంఘనలకు రేపట్నుంచి 600 డి హెచ్  చెల్లించాలి

దుబాయ్ : ఆల్ గుబైబ మరియు మమజార్ బస్సు దారులపై  ఉల్లంఘనలకు వాహనదారులు పాల్పడితే, ఇకపై 600 డి హెచ్ జరిమానాగా చెల్లించడానికి మంగళవారం నుండి సిద్ధంగా ఉండాలి. అల్ గుబైబ మరియు అల్ మంజరి రహదారులను ఉపయోగించేవారు దారులు దుర్వినియోగంపై  ప్రత్యేక బస్సు మరియు టాక్సీ దారులపై నియంత్రణ చేసేందుకు గత నెలలో కెమెరాలను రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) ఏర్పాటు చేశారు.ఈ నిఘా కెమెరాలు నవంబర్ 1వ తేదీ ( రేపట్నుంచి ) పని చేయడం ప్రారంభమవుతుంది అలాగే  జరిమానాల స్వయంచాలకంగా ఉల్లంఘించినందుకు వాహనాల ప్లేట్ సంఖ్యలతో సహా జారీ చేయబడుతుంది.ఆర్.టి.ఎ వద్ద ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ డైరెక్టర్ ఆడెల్ షాకేరి మాట్లాడుతూ, ప్రైవేట్ వాహనదారులు ఈ ఆంక్షలు అలవాటుపడేవరకు ఒక నెలరోజుల పాటు ట్రయల్ గా వదిలివేయనున్నట్లు  అన్నారు. ఆ విచారణ కాలంలో కెమెరాల ద్వారా 8.439 ఉల్లంఘనలకు పాల్పడినవారిని గుర్తించినట్లు పేర్కొంటూ , కానీ వారిని శిక్షార్హులుగా నమోదు చేయలేదని అన్నారు.అయితే, ఈ విధానం నవంబర్ 1 వ  తేదీ ( రేపట్నుంచి ) అమలవుతుందని అన్ని ఉల్లంఘనలకు  జరిమానాల జారీ ప్రారంభమౌతుందని విమరించారు. దుబాయ్ నగరంలోని వివిధ ప్రాంతాలలో ఏడు కిలోమీటర్ల నిడివిలో వ్యాపించి ఉన్నబస్సు మరియు టాక్సీ ప్రాధాన్యత దారులు ఉన్నాయి.గతేడాది ఆర్.టి.ఎ  నైఫ్  రోడ్ మీద  ఏ పీ ఎన్ ఆర్  స్వయంచాలక నంబర్ ప్లేట్ గుర్తింపు కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రత్యేక బస్సు దారులపై  88 శాతం ఉల్లంఘనలు తగ్గడానికి సహాయపడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com