హైకోర్టును ఆశ్రయించిన ఆర్కే భార్య శిరీష...
- October 31, 2016
ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఆయనను వెంటనే కోర్టు ముందు ప్రవేశపెట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మావోయిస్టు అగ్ర నేత ఆర్కే భార్య శిరీష సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర వ్యాజ్యంగా తన పిటిషన్ ను విచారించాలని ఆమె కోరారు. మల్కన్ గిరి ఎన్ కౌంటర్ తర్వాత ఆర్కేను గ్రే హౌండ్ పోలీసులు అరెస్టు చేశారని సీపీఐ మావోయిస్ట్ ఈస్ట్ డివిజన్ కమిటీ నేత కైలాష్, విప్లవ కవి, సివిల్ రైట్స్ యాక్టివిస్ట్ వరవర రావు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆర్కేను తక్షణమే కోర్టులో హాజరు పరచాలని వరవర రావు ఇటీవల హైదరాబాద్ లో ధర్నా కూడా చేశారు.ఆర్కే తమ కస్టడీలో లేరని విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, ఏపీ డీజీపీ సాంబశివరావు చేసిన ప్రకటనలను ఆయన ఖండించారు.ఆర్కే ఎక్కడున్నారో తమకు తెలియదని సాంబశివరావు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారని, ఆయనను ఏ క్షణంలో అయినా వారు చంపేయవచ్చునని ఆదివాసీ హక్కులు, సంస్కృతి పరిరక్షణ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దామోదర తిలక్ ఆరోపించారు. ఆర్కే తో బాటు మరో 9 మంది మావోయిస్టులు, గిరిజనులు పోలీసుల కస్టడీలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కాగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఏవోబీలో జాయింట్ ఆపరేషన్ ను పోలీసులు నిలిపివేశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







