ఫుట్‌బాల్ మ్యాచ్‌పై టెర్రర్ కుట్ర భగ్నం
- October 31, 2016
మనామా: జెడ్డాలోని రెడ్ సీలోగల జవహారా స్టేడియంలో ఫుట్‌బాల్ వరల్డ్ కప్ క్వాలిఫైర్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో విధ్వంసం సృష్టించడానికి పన్నిన టెర్రర్ కుట్రని సౌదీ సెక్యూరిటీ ఏజెన్సీ ముందే పసిగట్టి, ఆ కుట్రను ఛేదించింది. కొద్ది రోజుల ముందే టెర్రర్ కుట్రపై సమాచారం సేకరించిన భద్రతాదళాలు, సెక్యూరిటీ ఏజెన్సీ వ్యూహాత్మకంగా స్పందించాయి. టెర్రిస్టులు స్టేడియం పార్కింగ్ లాట్‌లోని ఓ కారులో పేలుడు పదార్థాల్ని ఉంచాలనుకున్నారు. అయితే భద్రతాదళాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడంతో టెర్రరిస్టుల పాచిక పారలేదు. ఈ కుట్రకు సూత్రధారులుగా ఇద్దరు పాకిస్తానీ వ్యక్తులు, అలాగే ఒకరు సిరియన్, మరొకరు సుడానీస్ ఉన్నట్లు తేలింది. తీవ్రవాదులు టార్గెట్ చేసిన మ్యాచ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగ్గా, ఈ మ్యాచ్‌లో సౌదీ అరేబియా 3-0 తేడాతో విజయం సాధించింది. ఇంకో కేసులో భద్రతాదళాలపై దాడులకు యత్నించిన నలుగురు తీవ్రవాదుల గ్రూప్‌ని నిర్వీర్యం చేశారు. దయీష్ టెర్ర్ గ్రూప్‌కి చెందిన లీడర్‌తో ఈ నలుగురికీ సంబంధాలున్నాయి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







