ఐదేళ్ల తర్వాత సొంతగడ్డకు బళ్లారికి చేరుకోనున్నా గాలి...
- October 31, 2016
గనుల అక్రమ తవ్వకం ఆరోపణలపై 2011 సెప్టెంబరు 5న అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి ఐదేళ్ల తర్వాత తొలిసారిగా సొంతగడ్డ బళ్లారికి చేరుకోనున్నారు. నవంబరు 16న కుమార్తె బ్రహ్మణి వివాహం నేపథ్యంలో ఒకటో తేదీ నుంచి 21 వరకు ఆయన బళ్లారిలో ఉండేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. 2011 సెప్టెంబరు 5న బళ్లారిలోని జనార్దన్‌రెడ్డి ఇంటి నుంచి సీబీఐ ఆయన్ను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించింది. తర్వాత 2012 ఆగస్టు 16న బందోబస్తు మధ్య ఆయన్ను బళ్లారికి తీసుకొచ్చి అదే రోజు రాత్రి ఇక్కడి కేంద్ర కారాగారానికి తరలించింది. అనంతరం హైదరాబాద్, బెంగళూరులలో జనార్దన్‌రెడ్డి మూడున్నరేళ్లపాటు జైలు జీవితం గడిపారు.తర్వాత బెయిలుపై విడుదలైనా బళ్లారికి వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించలేదు. ఇప్పుడు ఆయనకు ఆ అవకాశం లభించింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







