'కదంబన్' లో ఆర్య లుక్ అదిరిపోయింది...

- November 01, 2016 , by Maagulf
'కదంబన్' లో   ఆర్య లుక్ అదిరిపోయింది...

కోలీవుడ్ హీరో ఆర్య నటిస్తున్న చిత్రం 'కదంబన్'. దర్శకుడు రాఘవ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్టు లుక్ ను విడుదల చేశారు. ఇక ఈ సినిమా కోసం ఆర్య కండలు పెంచేసి.. తన రూపంలో చాలానే మార్పులను తీసుకొచ్చాడు. గిరిజనుడి పాత్ర కోసం అన్ని రకాలుగాను.. ఛేంజెస్ చూపించాడు. ఒరిజినల్ అడవులకు కాసిన్ని గ్రాఫిక్స్ కూడా మిక్స్ చేసి.. సిక్స్ ప్యాక్ చేసిన అడవి వీరుడుగా చేతిలో కర్ర పట్టుకున్న ఆర్య లుక్ అదిరిపోయిందనే చెప్పాలి.కొడైకెనాల్ అడవులతో పాటు.. థాయ్ ల్యాండ్ లోని దట్టమైన అడవుల్లో ఈ మూవీ షూటింగ్ చేశారు. థాయ్ ల్యాండ్ లో 50 ఏనుగులతో ఆర్య చేసిన ఫైట్ ఈ చిత్రానికి హైలైట్ కానుంది. ఈ చిత్రంలో ఆర్య సరసన కేథరిన్ థ్రెసా నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com