కార్మిక చట్టం ఉల్లంఘించినందుకు701 మంది అరెస్టు

- November 01, 2016 , by Maagulf
కార్మిక చట్టం ఉల్లంఘించినందుకు701 మంది అరెస్టు
మస్కట్ : ఒమన్ లో కార్మిక చట్టాలను అతిక్రమించిన 701 మంది నిర్వాసితులను గత వారం అధికారులు   అరెస్టు చేశారు.అరెస్టు కాబడిన వారిలో 612 మంది  వాణిజ్య కార్మికులు, 50 మంది వ్యవసాయ కార్మికులు మరియు 39 మంది దేశీయ కార్మికులను అదుపులోనికి తీసుకొన్నట్లు మానవ వనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది.వీరందరిని అక్టోబర్ 23 వ తేదీ మరియు 29 మధ్య కాలంలో అరెస్టు చేశారు. మంత్రిత్వశాఖ అరెస్టు చేసిన వారిలో 263 మంది పరారీలో ఉన్నారని మరియు 410 మంది దాక్కొని ఉన్నట్లు వివరించింది. మస్కట్ లో అత్యధికంగా 397 మంది కార్మికులను అరెస్టు చేశారు. ఉత్తరంవైపున అల్ బతినః లో 109 మందిని ఆ తరువాత స్థానంలో అరెస్ట్ చేశారు. 315 మంది అక్రమ కార్మికులు దేశమునుండి వెడలి పోయినట్లు మానవ వనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com