దుబాయ్‌లో ఈజిప్షియన్‌ ఫ్లాట్‌ను అమ్మేసిన భారతీయుడు!

- November 01, 2016 , by Maagulf
దుబాయ్‌లో ఈజిప్షియన్‌ ఫ్లాట్‌ను అమ్మేసిన భారతీయుడు!

మాయమాటలతో ఓ ఈజిప్షియన్‌ను మోసగించి తనది కాని ఫ్లాట్‌ను విక్రయించిన భారతీయుడి కోసం దుబాయ్ పోలీసులు గాలిస్తున్నారు. ఫోర్జరీ, మోసం కేసులు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం వేట ప్రారంభించారు. వారి వివరాల ప్రకారం.. పరారీలో ఉన్న నిందితుడు మరో వ్యక్తితో కలిసి తనది కాని ఓ ఫ్లాట్‌కు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించాడు. వాటిని ఓ ఈజిప్షియన్ వ్యాపారవేత్త(51)కు చూపించి ఫ్లాట్‌ను అమ్మకానికి పెట్టాడు. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ జారీ చేసినట్టుగా ఉన్న ఆ డాక్యుమెంట్లను చూసిన వ్యాపారి అతడితో 9,25,650 దిర్హమ్స్‌(2,52,018 డాలర్లు)కు ఒప్పందం కుదుర్చుకుని చెల్లించాడు. డిసెంబరు 2014- జూన్ 2015 మధ్య ఈ ఘటన జరిగినట్టు బాధిత వ్యాపారి పోలీసులకు వివరించాడు.

నిందితుడిపై ఫోర్జరీ, మోసం కేసులు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com