ప్రమాదంలో యమునా ఎక్స్‌ప్రెస్‌..

- November 03, 2016 , by Maagulf
ప్రమాదంలో  యమునా ఎక్స్‌ప్రెస్‌..

దట్టమైన పొగమంచు కారణంగా రాజధాని దిల్లీ సమీపంలో గురువారం ఉదయం యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై వరుసగా 20 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. దిల్లీలో గత కొద్ది రోజులుగా కాలుష్యం స్థాయులు విపరీతంగా పెరగడంతో అది దట్టమైన పొగమంచుతో కలిసి వాతావరణంలో వ్యాపిస్తోంది. పొగమంచు వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. దీపావళి పండగ రోజు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడంతో వాటి పొగ కారణంగా కాలుష్యం స్థాయి మరింత పెరిగింది. దిల్లీ, నోయిడా, ఆగ్రాలను కలిపే ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై గతంలో కూడా పలుమార్లు పొగమంచు కారణంగా ఈ తరహా ప్రమాదాలు జరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com