ప్రమాదంలో యమునా ఎక్స్‌ప్రెస్..
- November 03, 2016
దట్టమైన పొగమంచు కారణంగా రాజధాని దిల్లీ సమీపంలో గురువారం ఉదయం యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై వరుసగా 20 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. దిల్లీలో గత కొద్ది రోజులుగా కాలుష్యం స్థాయులు విపరీతంగా పెరగడంతో అది దట్టమైన పొగమంచుతో కలిసి వాతావరణంలో వ్యాపిస్తోంది. పొగమంచు వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. దీపావళి పండగ రోజు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడంతో వాటి పొగ కారణంగా కాలుష్యం స్థాయి మరింత పెరిగింది. దిల్లీ, నోయిడా, ఆగ్రాలను కలిపే ఈ ఎక్స్‌ప్రెస్ హైవేపై గతంలో కూడా పలుమార్లు పొగమంచు కారణంగా ఈ తరహా ప్రమాదాలు జరిగాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







