కార్మిక సంస్కరణలు 100 శాతం అమలు
- November 03, 2016
ఖతార్‌లో 100 శాతం కార్మిక సంస్కరణలు అమలవుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. 2016 డిసెంబర్ నాటికి ఈ ఘనతను సాధిస్తామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్కరణలు ప్రారంభించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా దోహాలో విడుదలైన గణాంకాల్ని బట్టి చూస్తే 2.1 మిలియన్ వర్క్ ఫోర్స్‌లో 1.8 మిలియన్ కార్మికులకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో వేతనాల చెల్లింపు జరుగుతోంది. వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఫలితమే ఇది. సుమారుగా 37,000 కంపెనీలు ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. బ్లూ కాలర్ వర్కర్స్‌కి జీతాల చెల్లింపులో సమస్యలపై హక్కుల సంస్థలు పోరాటం చేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గడచిన ఏడాది కాలంలో కార్మిక శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 385 ఉల్లంఘనలు నమోదయ్యాయి. అయితే ఈ ఉల్లంఘనలకు సంబంధించి యజమానులు ఎవరైనా శిక్షింపబడ్డారా? అన్నదానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. సెప్టెంబర్‌లో 400 మంది మైగ్రెంట్ స్టాఫ్, నాలుగు నెలలపాటు జీతాలు లేక ఇబ్బందులు పడిన విషయం వెలుగు చూసింది. చిన్న చిన్న సమస్యలు, సవాళ్ళు ఉన్నప్పటికీ వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ని సమర్థవంతంగా, సంపూర్ణగా అమలు చేస్తున్నట్లు లేబర్ మినిస్టర్ ఇస్సా బిన్ సాద్ అల్ జఫాలి అల్ నౌమి చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







