గోఎయిర్ ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్..
- November 04, 2016
విమానయాన సంస్థలు అందించే సీజన్ టిక్కెట్లు కొనడం చేజారినవని బాదపడుతున్నారా..? అయితే ఎలాంటి దిగులు అవసరం లేదట. వాదియా గ్రూప్ కు చెందిన లో-కాస్ట్ విమానయాన సంస్థ గోఎయిర్ ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్ ను ప్రయాణికుల ముందుకు తీసుకొచ్చింది. 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, రూ.611కే విమాన టిక్కెట్ ను అందించనున్నట్టు పేర్కొంది. నవంబర్ 4 తేదీ నుంచి 8వ తేదీ మధ్యలో ప్రయాణికులు ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవాలని తెలిపింది. 2017 జనవరి 11 నుంచి 2017 ఏప్రిల్ 11వరకున్న ట్రావెల్ కాలంలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని గోఎయిర్ ప్రకటించింది.
రూ.611 ప్రారంభ టిక్కెట్ ధరలో కేవలం బేస్ ఛార్జీలు, ప్యూయెల్ సర్ ఛార్జీలు మాత్రమే కలిసి ఉండనున్నాయి.
ప్రస్తుతం అందుబాటులోఉన్న నియమాల ప్రకారం పన్నులు, టిక్కెట్ ధరకు ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. డిస్కౌంట్లు మాత్రమే కాక, ఇతర డిస్కౌంట్లను కూడా ప్రయాణికులు పొందవచ్చు. ప్రతి 11వ కస్టమర్, ఉచిత టిక్కెట్ ను, 111వ కస్టమర్ అన్ని లెమన్ ట్రీ హోటల్ స్టేలో 40 శాతం డిస్కౌంట్ ను, 1,111వ కస్టమర్ తిరుగు ప్రయాణ టెక్కెట్స్ తో పాటు, రెండు రాత్రులు హోటల్స్ లో గడిపే అవకాశాలను గెలుపొందవచ్చు.
అయితే కొన్ని ట్రావెల్ సెక్టార్లలో మాత్రం ఈ ఆఫర్ వర్తించదు అవి..
ముంబాయి-పోర్ట్ బ్లెయిర్- ముంబాయి
బెంగళూరు-పోర్ట్ బ్లెయిర్-బెంగళూర్
చెన్నై-పోర్ట్ బ్లెయిర్-చెన్నై
ఢిల్లీ-లెహ్-ఢిల్లీ
ముంబాయి-లెహ్-ముంబాయి
కోల్ కత్తా-పోర్ట్ బ్లెయిర్-కోల్ కత్తా
ఢిల్లీ-పోర్ట్ బ్లెయిర్-ఢిల్లీ
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







