టర్కీలో భారీ కారు బాంబు పేలుడు:ఒకరి మృతి, 30 మందికి గాయాలు
- November 04, 2016
- ఒకరి మృతి, 30 మందికి గాయాలు
- కుర్దు తిరుగుబాటుదారులపైనే అనుమానాలు
అంకారా : టర్కీలోని దియార్‌బాకిర్ నగరంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. పోలీస్ ప్రధాన కార్యాలయానికి సమీపంలో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, పోలీస్ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకొని మిలిటెంట్లు ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు తాకిడితో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు సమీపంలో ఉన్న నాలుగు భవనాలు భారీగా ధ్వంసమయ్యాయి. టర్కీ సైన్యం, ప్రత్యేక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.ఇదిలా ఉండగా, కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీకి ( పీకేకే ) చెందిన తిరుగుబాటుదారుల ఏరివేత కోసం టర్కీ ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌ను పీపుల్స్ డెమోక్రసీ పార్టీ (హెచ్‌డీపీ ) వ్యతిరేకిస్తున్నది. గురువారం అర్థరాత్రి 11మంది ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, దియార్ బాకిల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఎంపీలు అరెస్టయిన కొద్దిగంటల్లోనే ఈ పేలుడు సంభవించింది. దీంతో, కుర్దు తిరుగుబాటుదారులే ఈ పేలుడుకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







