శ్రామికుల భద్రతపై ఒమాన్ కఠిన నియమాలు
- August 26, 2015
భవన నిర్మాణ ప్రదేశాల వద్ద సంభవిస్తున్న వరుస ప్రమాదాల పేపధ్యంలో, శ్రామికుల భద్రతా ప్రమాణాలను పాటించని లేదా అతిక్రమించే కంపెనీలపై జరిమాన విధించక తప్పదని, మానవ వనరుల శాఖ వారు స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా, సీబ్ మరియు బురైమి లలో మొత్తం ఆరుగురు శ్రామికులు గాయాలపాలయ్యారు; ఇక్కడి ఒక భారతీయ సమాజ సేవకుడు మాట్లాడుతూ, కనీసం నెలకు నలుగురు శ్రామికులు ప్రమాదాల పాలైన కేసులను తాము డీల్ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల నుండి ఎక్కువగా అత్యవసర కాల్స్ వస్తున్నాయని, వారిలో చాలామంది సరయిన రక్షణ ఏర్పాట్లు లేకుండానే తమ ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకుంటున్నారని, దురదృష్టవశాత్తూ తీవ్రగాయాల పాలవుతున్నారని, మస్కట్ కు చెందిన సోషల్ వర్కర్ షమీర్ పి. టి. కె. తెలిపారు. భద్రత గల వాతావరణంలో పనిచేయడం ప్రతి ఒక శ్రామికుడి హక్కు అని, బూట్లు, గ్లొవ్ లు, తల మరియు కళ్ళకు రక్షణ, ఇంకా సైట్ సేఫ్టీ కొరకు శిక్షణ పొందటం వంటి వాటిని యజమాన్యం తప్పక కల్పించాలని, కాంపిటెన్స్ హెచ్ ఆర్ ట్రైనింగ్ మానేజర్ మార్క్ పడ్వెల్ తెలియజేశారు. ప్రాణo కంటే, భద్రతా పరికరాలకు, శిక్షణకు అయ్యే ఖరీదు విలువ ఎక్కువేమీ కాదని ఆయన స్పష్టం చేశారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







