కృష్ణా జిల్లాలో త్వరలో రూ.వెయ్యి కోట్లతో క్షిపణి ప్రయోగ కేంద్రం..
- November 07, 2016
కృష్ణా జిల్లా నాగాయలంకలో త్వరలో రూ.వెయ్యి కోట్లతో క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటు కానున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. రక్షణ అవసరాలు తీర్చే సామాగ్రి తయారీకి ఏపీ హబ్‌గా మారుబోతోందని ఆయన పేర్కొన్నారు. 2017 జనవరి 3న తిరుపతిలో జాతీయ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. అక్కడే ప్రధాని చేతుల మీదుగా సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.విజయవాడ సిద్ధార్థ కళాశాలలో మూడురోజుల పాటు నిర్వహించే సైన్స్ కాంగ్రెస్‌ను సోమవారం చంద్రబాబు ప్రారంభించారు. శాస్త్ర, విజ్ఞానం, ప్రజారోగ్య అభివృద్ధిలో సాంకేతిక విజ్ఞానంపై సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా శాస్త్ర, విజ్ఞాన రంగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న యువ శాస్త్రవేత్తలను చంద్రబాబు సత్కరించారు.అనంతరం పద్మభూషన్ రామారావు, డా.బీఎం హెడ్గే, పద్మశ్రీ కాకర్ల సుబ్బారావు, డా. చావా సత్యనారాయణ, డా.బీజీ సిద్ధార్థ, డా.సతీశ్‌రెడ్డి, డా.శశిథామస్‌లకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







