జయమ్ము నిశ్చయమ్మురా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..
- November 08, 2016
ఓ చిన్న సినిమా పాజిటివ్ టాక్ తో రిలీజ్ కావడం చాలా అరుదు. కమెడియన్ శ్రీనివాస్ 'జయమ్ము నిశ్చయమ్మురా' చిత్రం ఆ అరుదైన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో పూర్ణ హీరోయిన్. శివరాజ్ కనుమూరి దర్శకుడు. ఫస్ట్ లుక్ నుంచే ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా జరిగిపోయింది. ఈ నెల 13న ఆడియో విడుదల కానుండగా. 24న ఈ చిత్రం ప్రేక్షకుల రానుంది.తాజాగా, 'జయమ్ము నిశ్చయమ్మురా' సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ని జారీ చేసింది. సెన్సార్ బోర్డ్ ఫీల్ గుడ్ మూవీ చూశామనే కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది.తత్కాల్ ప్రవీణ్ అంటూ కమెడియన్ ప్రవీణ్, అడపా ప్రసాద్ గా కృష్ణ భగవాన్ పాత్రలు చేసిన కామెడీ అద్భుతంగా పండాయట. శ్రీనివాస్ రెడ్డి పాత్రని మలిచిన తీరు చాలా బాగుందంటున్నారు. మొత్తానికి శ్రీనివాస్ రెడ్డి ఖాతాలో మరో విజయం చేరడం ఖాయమన్నది సెన్సార్ టాక్.
ఈ నెల 13న ఈ చిత్రం ఆడియో కార్యక్రమం జరగనుంది. ఈ ఆడియో వేడుకకి స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నాడట. ఇదే జరిగితే.. ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెరిగిపోవడం ఖాయం.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









