చిత్రం క్లైమాక్స్ షూటింగ్ సమయంలో ప్రతినాయకులు జలసమాధి..
- November 08, 2016
దునియా విజయ్ హీరోగా నటిస్తున్న మాస్తిగుడి చిత్రం క్లైమాక్స్ షూటింగ్ సమయంలో జలసమాధి అయిన ప్రతినాయకులు అనీల్, రాఘవ్ ఉదయ్ చావుకు మీరే కారణం అంటూ సినిమా యూనిట్ సభ్యుల మీద రామనగర జిల్లా తావరకెరె పోలీసులు కేసు నమోదు చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ తయారు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మాస్తిగుడి సినిమాలో ప్రతినాయకులు అయిన అనీల్, ఉదయ్ చావుకు కారణం అయ్యారంటూ ఐపీసీ సెక్షన్ 304 (A), 308 కింద నాన్ బెయిల్ కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.మాస్తిగుడి సినిమా నిర్మాత సుందర్ గౌడ ఎ-1, దర్శకుడు నాగశేఖర్ ఎ-2, అసిస్టెంట్ డైరెక్టర్ ఎ-3, ఫైట్ మాస్టర్ రవివర్మ ఎ-4 నిందితులని కేసులు నమోదు చేశారు.అయితే సినిమా హీరో దునియా విజయ్ మీద క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.సోమవారం హెలికాప్టర్ నుంచి తిప్పగుండనహళ్ళి చెరువులో దూకిన ప్రతినాయకులు అనీల్, ఉదయ్ ల ఆచూకి ఇప్పటి వరకు లేదు. వారి మృతదేహాలు చిక్కకపోవడంతో మంగళవారం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు చెరువులో అనీల్, ఉదయ్ ల కోసం గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







