కల్లోలిత తూర్పు కాంగోలోని గోమా నగరంలో పేలుడు...
- November 08, 2016
కల్లోలిత తూర్పు కాంగోలోని గోమా నగరంలో మంగళవారం పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడులో ఒక చిన్నారి మృతి చెందగా, 32 మంది భారత శాంతిదూతలు గాయపడ్డారు. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న శాంతిదూతలు ఉదయం నడకకు వెళ్లిన సమయంలో ఈ పేలుడు సంభవించిందని ఐరాస మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని గోమా నగరం శివార్లలో ఉండే కీషెరో ప్రాంతంలో ఈ పేలుడు జరిగిందని, అయితే, ఈ పేలుడు కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు.అయితే, స్థానిక మసీదు ఇమామ్ ఇస్మాయిల్ సలుము మీడియాతో మాట్లాడుతూ ఈ పేలుడులో ముగ్గురు శాంతిదూతలు చనిపోయినట్టు తెలిపాడు. ఒక్కసారిగా తమకు పేలుడు చప్పుడు వినిపించిందని, ఆ వెంటనే ఆర్తనాదాలు విన్నంటాయని, దీంతో తాము సంఘటనా స్థలానికి పరిగెత్తుకు వెళ్లామని ఆయన చెప్పారు1996-2003మధ్యకాలంలో ప్రాంతీయ ఘర్షణలతో అట్టుడికిన కాంగోలో లక్షలాది మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇక్కడ అనేక సాయుధ మూకలు చెలరేగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐరాసకు చెందిన 1800మంది సిబ్బంది ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









