నల్లధన కట్టడికి మోదీ సాహసోపేత చర్య
- November 08, 2016
సామాన్య, మధ్య తరగతికి వూరట
నల్లధన కట్టడికి మోదీ సాహసోపేత చర్య
పెద్దనోట్ల నిషేధంతో స్థిరాస్తి, పసిడిపై ప్రభావం
ఈనాడు వాణిజ్య విభాగం
రూ.500, రూ.1,000 నోట్ల రద్దు ప్రభావం స్థిరాస్తి, పసిడి రంగాలపైనే అధికంగా ఉండే అవకాశం ఉంది. ఒకేసారి అధికమొత్తం, అనధికార చెల్లింపులు ఈ రంగాల్లోనే సాగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. అందువల్లే పెద్దనోట్ల రద్దు అనే సాహసోపేత నిర్ణయాన్ని ప్రధాని మోదీ తీసుకున్నారు.
దీనివల్ల ధరల కృత్రిమ పెరుగుదల ఆగిపోతుంది. అధిక విలువ కలిగిన ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, వాహన రంగాలపైనా ప్రభావం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దే శీయ ఆర్థిక వ్యవస్థలో నగదు చెలామణి గణనీయంగా పెరిగిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రూ.16.50 లక్షల కోట్ల నగదు చెలామణిలో ఉందని సమాచారం. ఇంత నగదు చెలామణిలో ఉన్నా, బ్యాంకులలోకి చేరుతున్న మొత్తం తగ్గిపోయింది. కారణం రూ.50,000 మించి నగదును కరెన్సీ రూపంలో ఖాతాలో వేసుకోవాలన్నా, డిపాజిట్ చేయాలన్నా కూడా శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) నమోదు చేయాల్సి వస్తోంది. షేర్లు, మ్యూచువల్‌ఫండ్ల వంటి వాటిల్లో పెట్టుబడులు పెడదామన్నా, ఆదాయపు పన్ను శాఖకు 'లెక్క' చెప్పుకోవాల్సి వస్తోంది. అందువల్ల నల్లధనం ఎక్కువగా బ్యాంకులకు బయటే ఉంటోంది. ఇలాంటి నగదుతో బంగారం, స్థిరాస్తి కొనుగోళ్లు అధికంగా సాగుతున్నాయని అంచనా.
స్థిరాస్తి కొనుగోళ్లలో ఖాతాలో చూపే, చూపని మొత్తాలు తప్పనిసరి: స్థిరాస్తి రంగంలో జరిగే లావాదేవీల్లో నల్లధనం తప్పనిసరి. స్థలం, ఫ్లాట్, ఇల్లు, పొలం.. ఏది అమ్మినా కూడా, రిజిస్ట్రేషన్ ధరకు, వాస్తవ ధరకు తేడా తప్పనిసరిగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ విలువను మాత్రం అధికారికంగా, చెక్/డీడీ/ఆన్‌లైన్ పద్ధతిలో వసూలు చేసుకుని, మిగిలింది నగదు రూపంలో తీసుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. పట్టణాలు, నగరాల్లో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ విలువ కంటే దాదాపు రెట్టింపు ధర పలుకుతోంది. తేడా మొత్తమంతా అనధికారిక చెల్లింపే. ఈ నగదు అంతా నల్లధనమే. కార్పొరేట్/అగ్రశ్రేణి స్థిరాస్తి సంస్థలు మినహా చిన్నా, చితకా స్థాయి నుంచి మధ్యస్థాయి భవవ నిర్మాణదారులు జరిపే విక్రయాల్లో అధికశాతం నగదు రూపంలోనే ఉంటాయి. పాత ఆస్తుల విక్రయంలోనూ నగదు లావాదేవీలే అధికం. వీరిపై అధిక ప్రభావం ఉంటుంది. ఇలాంటి లావాదేవీలన్నింటిలో రూ.500, 1,000 నోట్లదే కీలకపాత్ర.
* ఇప్పుడు పెద్ద నోట్లు రద్దవుతున్నందున, ఈ రంగానికి భారీ కుదుపు తప్పకపోవచ్చు. ధరలు దిగి రాక తప్పదు. అందుబాటు ధరల్లో ఫ్లాట్లు, ఇళ్ల నిర్మాణం పెరిగే అవకాశం ఉంది. సామాన్య, మధ్య తరగతికి ఇది రట కలిగిస్తుంది. చెక్, కార్డు రూపేణ చెల్లింపులు ప్రారంభమైతే, ఈ రంగం గాడిన పడుతుంది.
పసిడిపై ఎలా?
బంగారంపై కూడా దిగుమతి సుంకం 10 శాతం, వ్యాట్ 1 శాతం ఉంటోంది. ఇతర ఖర్చులు కూడా కలిపితే, అంతర్జాతీయ విపణి కంటే దాదాపు 12-13 శాతం వరకు దేశీయంగా ధర అధికంగా ఉంటోంది. దీంతోపాటు రూ.2 లక్షలకు మించి అధికారిక కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి అయింది. అందువల్లే దొంగచాటుగా దిగుమతి చేసుకునే నల్ల వ్యాపారుల వద్ద లావాదేవీలు పెరుగుతున్నాయని ప్రభుత్వమే ఇటీవల అనుమానం వ్యక్తం చేసింది. దేశంలోకి అధికారికంగా దిగుమతి అవుతున్న బంగారం తగ్గిపోవడానికి ఈ లావాదేవీలే కారణమని సందేహిస్తోంది. దొంగచాటుగా చేరిన బంగారానికి చెల్లింపులు కూడా బ్యాంకుల వంటి అధికారిక ఆర్థిక వ్యవస్థల ద్వారా జరగవు. ఈ మొత్తం కూడా హవాలా రూపంలో జరుగుతాయి. వీటికి కూడా పెద్ద నోట్లే ఆధారం. ఇవి రద్దయినందున, అధికారిక విక్రయాలు పెరిగేందుకు మార్గం సుగమం అవుతుందంటున్నారు. కొంతకాలం పాటు విక్రయాలపై ప్రభావం ఉన్నా, ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుందని చెబుతున్నారు.
* రైతు వారీ కొనుగోళ్లు అధికంగా నగదు రూపేణ జరుగుతాయని, చిరు వ్యాపారులు, నగల తయారీదార్లను వీరు ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ఈ లావాదేవీలపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, వాహనాలు
ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, వాహనాల కొనుగోళ్లు అధికారికంగానే జరుగుతున్నాయి. వీటికి వారెంటీ, విక్రయానంతర సేవలు అవసరం కనుక ఇలా చేస్తున్నారు. అయితే ఈ కొనుగోళ్లలోనూ నగదు చెలామణి ఎక్కువే. ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో రుణంపై తీసుకునే వారు 30 శాతం మంది ఉంటే, మిగిలిన వారు కార్డులు, నగదు రూపేణ తీసుకుంటారు. రూ.లక్ష అంతకుమించి విలువైన గృహోపరణాలను నగదు రూపేణ తీసుకునేవారు ఎక్కువగా ఉంటున్నారు. ఇటువంటి లావాదేవీల్లో నల్లధనం, పెద్దనోట్ల చెలామణి ఎక్కువే. కార్లు, ఆపై వాహనాల్లో అత్యధికం రుణంపైనే ఉంటాయి. ద్విచక్ర వాహనాలలో నగదు చెల్లించి, రుణంపై తీసుకునేవే అధికం. వీటికి కార్డుల రూపంలో చెల్లించే వారు తక్కువ. ఇక వినియోగ వాహన విపణిలో అయితే 95 శాతం నగదు రూపంలో లావాదేవీలే ఉంటాయని చెబుతున్నారు. కార్పొరేట్ సంస్థలు నెలకొల్పిన విక్రయసంస్థల్లో మాత్రం అధికారిక ఆర్థిక వ్యవస్థల ద్వారా లావాదేవీలు ఉంటాయని చెబుతున్నారు. రూ.50,000 అంతకుమించి ఖరీదైన సెల్‌ఫోన్లను కూడా రుణం/క్రెడిట్‌కార్డు/సులభ వాయిదాల్లో లేదా నల్లధనంతో కొంటున్నవారున్నారు. వీటన్నిటిపై ప్రభావం తప్పదని అంటున్నారు.
ఏమంటున్నారంటే.. ఏ టీఎమ్‌లను ఎప్పటికప్పుడు నింపడానికి మేం కృషి చేస్తాం. అత్యవసరాల కోసం ప్రభుత్వం కొన్ని మినహాయింపులను ఇచ్చింది. వినియోగదార్లు కష్టపడకుండా ఉండేందుకు మేం అన్ని విధాలా పనిచేస్తాం. గతంలోనూ బ్యాంకింగ్ వ్యవస్థ ఇలాంటి కరెన్సీ రద్దు పరిణామాలను సమర్థంగా ఎదుర్కొంది. కౌంటర్లు, ఏటీఎమ్‌ల నుంచి నగదును బయటకు తీయడం కోసం బ్యాంకులను బుధవారం మూసివేస్తాం.
- అరుంధతీ భట్టాచార్య, ఛైర్‌పర్సన్, ఎస్‌బీఐ
స మాంతర ఆర్థిక వ్యవస్థ(నల్లధనం)ను తుడిచిపెట్టడానికి తీసుకున్న అతిపెద్ద అడుగు ఇది. అన్ని అధికారిక చెల్లింపు వ్యవస్థలకు ఇది తమిస్తుంది. దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు తమిస్తుంది.
- చందా కొచ్చర్, సీఈఓ, ఐసీఐసీఐ బ్యాంక్
ఇ ది చాలా పెద్ద సంస్కరణ. ఎవరూ హించలేదు. ఇది నల్లధనం ఉండి, పన్నులు చెల్లించని డబ్బు కలిగిన వారిపై ఇది పెద్ద ప్రభావం చూపుతుంది. నగదు లావాదేవీలపై ఆధారపడే స్థిరాస్తి రంగంపైనా ప్రభావం ఉండొచ్చు. నిర్మాణ కార్యకలాపాలు కూడా మందగమనం పాలు కావొచ్చు. అయితే ఇవన్నీ కూడా దీర్ఘకాల ప్రయోజనాల కోసం స్వల్పకాలంలో ఎదుర్కొనే సమస్యలుగా భావించాలి.
- దీపక్ పరేఖ్, ఛైర్మన్, హెచ్‌డీఎఫ్‌సీ
వి జయానికి ఆశ్చర్యం అవసరం. ఎవరికీ తెలియకుండా.. రహస్యంగా ఉంచుతూ ఉన్నట్టుండి వెలువడిన ఈ ప్రకటనను 'మాస్టర్ స్ట్రోక్'గా చెప్పవచ్చు. ఎవరైనా ఈ రాత్రి బ్యాంకు దొంగతనానికి వెళితే.. మీరే దొంగతనానికి గురవుతారు జాగ్రత్త.
- ఆనంద్ మహీంద్రా, వైస్ ఛైర్మన్ మహీంద్రా అండ్ మహీంద్రా
న ల్లధనాన్ని అరికట్టడానికి వేసిన అద్భుతమైన, ధైర్యంతో కూడిన అడుగు ఇది. మోదీ నిజంగా ప్రశంసార్హుడు.
- సజ్జన్ జిందాల్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్
ఇ దో ధైర్యంతో కూడిన అడుగు. స్వల్పకాలంలో దీనిని అమలు చేయడం సవాలుతో కూడుకున్నదే అయినా.. దీర్ఘకాలంలో గొప్ప ప్రయోజనాలు అందుతాయి.
- కేకీ మిస్త్రీ, వైస్ ఛైర్మన్, హెచ్‌డీఎఫ్‌సీ
దీ ని కంటే ఉత్తమమైన చర్య ఉండదు. దీని ఫలితాలు కనిపిస్తాయి. అవినీతిని ఇది అంతం చేయగలదు. ప్రధాని మోదీకి సీఐఐ శుభాకాంక్షలు చెబుతోంది.
- నౌషద్ ఫోర్బ్స్, ప్రెసిడెంట్, సీఐఐ
స మాంతర ఆర్థిక వ్యవస్థ ప్రభావాన్ని తుడిపెœట్టడంతో పాటు.. టెర్రరిస్టులకు ఆర్థిక సహాయాన్ని ఆపుతుంది. ప్రభుత్వ చర్యకు ఫిక్కీ పూర్తి మద్దతునిస్తుంది. అమలు కోసం, ప్రభుత్వ, ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంటుందనే భావిస్తున్నాం.
- హర్షవర్ధన్ నియోతియా, అధ్యక్షుడు, ఫిక్కీ
న రేంద్ర మోదీ ప్రభుత్వం ధైర్యంగా తీసుకున్న అద్భుత చర్య ఇది. బ్యాంకింగ్ వ్యవస్థలోకి అపార నిధులు వచ్చి చేరతాయి. నమోదిత/సంఘటిత సంస్థలు అధికారికంగా లావాదేవీలు నిర్వహిస్తున్నందున ఇబ్బందులుండవు. ఇళ్లు/ఫ్లాట్లకు గిరాకీ/విక్రయాలపై పెద్ద ప్రభావం పడదు. పెద్ద నగరాలల్లో పాత ఆస్తుల విక్రయంపై మాత్రం ప్రభావం ఉంటుంది.
- ఇర్ఫాన్ రజాక్, క్రెడాయ్ ఛైర్మన్
ఒడుదొడుకులు ఎదుర్కొనేందుకు సిద్ధం మా ర్కెట్లు బుధవారం పనిచేస్తాయని.. అన్ని చర్యలూ తీసుకున్నామని స్టాక్ ఎక్స్ఛేంజీలు పేర్కొన్నాయి. రూ.500, రూ.1000 నోట్ల చెలామణీ రద్దు; అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నష్టభయాన్ని నివారించే వ్యవస్థలను, నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేశామని వివరించాయి. బ్యాంకులు నేడు మూసి ఉన్నప్పటికీ.. స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయని.. అన్ని క్లియరింగ్, సెటిల్‌మెంట్ వ్యవస్థలు సాధారణ కార్యకలాపాలు జరుగుతాయని ఎక్స్ఛేంజీ అధికారులు అంటున్నారు. భారీ గిసలాటలను తట్టుకోవడానికి సైతం అవసరమైన చర్యలన్నిటినీ సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









