సుజీత్-ప్రభాస్ చేయబోయేది జేమ్స బాండ్ తరహా సినిమా..
- November 09, 2016
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి-2 తర్వాత సుజీత్ దర్శకత్వంలో చేయబోయే కొత్త సినిమాలో ఒక ఫైట్ కోసం ఏకంగా రూ.30 కోట్లకు పైగా ఖర్చే చేయబోతున్నారన్న వార్త హాట్ టాపిక్ అయింది. రూ.30 కోట్లుంటే ఒక పెద్ద బడ్జెట్ సినిమానే తీసేయొచ్చంటే.. ఒక ఫైట్ కోసమే అంత ఖర్చు చేయడం ఏమిటా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇది గాల్లో హెలికాఫ్టర్ల మధ్య చిత్రీకరించే ఫైట్ అని.. అందుకే అంత ఖర్చు అని చెబుతున్నప్పటికీ మరీ రూ.30 కోట్లు పెట్టేస్తారా అని సందేహిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. ఐతే ఈ సినిమాకు అంత ఖర్చవడానికి వేరే కారణం ఉంది. ఈ ఎయిర్ ఫైట్‌ను కంపోజ్ చేసేది మన యాక్షన్ కొరియోగ్రాఫర్ కాదు. ఈ ఫైట్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్‌ను రప్పిస్తున్నారు.ఈ ఫైట్‌లో సగానికి సగం అతడి పారితోషకానికే పోతుందట. అతను బాగా కాస్టీ్ల అట. కొన్ని రోజులే పని చేసినా కోట్లల్లో పారితోషకం తీసుకుంటాడట. అందుకే ఈ ఫైట్‌కు అంత ఖర్చవుతోందని సమాచారం. ఐతే సుజీత్-ప్రభాస్ చేయబోయేది జేమ్స బాండ్ తరహా సినిమా కావడం.. ప్రభాస్ సినిమా అంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రేజ్ ఉండటంతో.. యాక్షన్ సీన్స హాలీవుడ్ రేంజిలో ఉండాల్సిందే అని ఫిక్సయ్యారట. అందుకే ఖర్చు గురించి ఆలోచించకుండా సినిమాను ఉన్నత ప్రమాణాలతో తెరకె క్కించాలని నిర్ణయించారు. ప్రభాస్ కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్కెట్ ఉంది కాబట్టి.. బడ్జెట్ ఎక్కువైనా ఇబ్బంది లేదని భావిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ.150 కోట్లని ప్రచారం జరుగు తోంది. ఈ డిసెంబర్లోనే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంటుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







