"హ్యాట్సాఫ్ నరేంద్ర మోదీ జీ. న్యూ ఇండియాకి ఇది శ్రీకారం : రజనీ
- November 09, 2016
దేశంలో బ్లాక్ మనీ ఆటకట్టించడానికి ప్రధాని నరేంద్రమోదీ విప్లవాత్మకమమైన నిర్ణయం తీసుకున్నారు. రూ. 500 రూ. 1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు మోడీ. దేశంలో బ్లాక్ మనీ నిరోధించేందుకు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారాయన. డిసెంబరు 30లోగా రూ.500, రూ.1000నోట్లు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని సుచించారు మోడీ.ఇప్పుడీ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. ఇదో సాహస నిర్ణయమని కొనియాడారు ప్రముఖులు, సామాన్య ప్రజలు. బ్లాక్ మనీ,దొంగనోట్లతో అక్రమాలకు పాల్పడేవారి ఆట కట్టించడానికి మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.ఇది నిజంగా గొప్ప నిర్ణయని, మోదీ దుమ్ము దులిపేశారని సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.తాజగా మోడీ తీసుకున్న ఈ నిర్ణయం పై సూపర్ స్టార్ రజనీ కాంత్ స్పదించారు. "హ్యాట్సాఫ్ నరేంద్ర మోదీ జీ. న్యూ ఇండియాకి ఇది శ్రీకారం. జైహింద్' అంటూ ట్విట్టర్ లో తన అనందం వ్యక్తం చేశారు రజనీకాంత్.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







