మహేష్‌బాబు, కొరటాల శివ నూతన చిత్రం ప్రారంభం...

- November 09, 2016 , by Maagulf
మహేష్‌బాబు, కొరటాల శివ నూతన చిత్రం ప్రారంభం...

మహేష్‌బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం ప్రారంభమైంది. బుధవారం జరిగిన చిత్ర పూజా కార్యక్రమానికి దర్శకుడు కొరటాల శివ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు సహా పలువురు హాజరయ్యారు. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది. దీనికి 'భరత్‌ అను నేనే' అనే పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా చిత్ర బృందం ఎలాంటి ప్రకటన చేయలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com