భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్రను ప్రారంభించిన బాలకృష్ణ
- November 09, 2016
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. బాలకృష్ణ 100వ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్.బి.కె. హెల్పింగ్ హ్యాండ్ జగన్ అండ్ టీమ్ ఆధ్వర్యంలో భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్రను నిర్వహిస్తున్నారు. భారతదేశంలోని 100 పుణ్య క్షేత్రాల్లో 100 కేజీల కుంకుమార్చనతో పాటు 23 శివలింగాలకు రుద్రాభిషేకం, సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. భారతదేశ సర్వమత శత పుణ్య క్షేత్ర జైత్రయాత్ర బుధవారం నుంచి ప్రారంభమైంది. కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌లు జెండా వూపి ఈ యాత్రను ప్రారంభించారు. ఈ చిత్రంలో శ్రేయా, హేమమాలిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 'గౌతమిపుత్ర..' ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!







