ట్విట్టర్‌ సంస్థ నుంచి వైదొగుతున్న సీఓఓ ఆడమ్‌ బైన్‌..

- November 10, 2016 , by Maagulf
ట్విట్టర్‌ సంస్థ నుంచి వైదొగుతున్న సీఓఓ ఆడమ్‌ బైన్‌..

ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ట్విట్టర్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థ నుంచి మరో కీలకమైన అధికారి తప్పుకున్నారు. ట్విట్టర్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీఓఓ) ఆడమ్‌ బైన్‌ సంస్థ నుంచి వైదొలగుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. వినియోగదారుల పెరుగుదల కోసం కృషి చేస్తున్న సమయంలో అడ్వర్టైజింగ్‌ బిజినెస్‌ బాగా పెంచిన ఆడమ్‌ ట్విట్టర్‌ను వీడడం కంపెనీకి ఎదురుదెబ్బే. ఆయన 2010లో ట్విట్టర్‌లో చేరారు. .ఆయన స్థానంలో చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌(సీఎఫ్‌ఓ) ఆంటోనీ నోటో బాధ్యతలు స్వీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది.సీఎఫ్‌ఓ స్థానంలో కొత్త వ్యక్తిని నియమిమించనున్నట్లు పేర్కొంది. నష్టాల కారణంగా గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌లో 9శాతం మందిని తొలగిస్తున్నట్లు గత నెలలోనే ట్విట్టర్‌ ప్రకటించింది. ఇటీవల ట్విట్టర్‌ ఇండియా హెడ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్లు కూడా సంస్థ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com