ట్విట్టర్ సంస్థ నుంచి వైదొగుతున్న సీఓఓ ఆడమ్ బైన్..
- November 10, 2016
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థ నుంచి మరో కీలకమైన అధికారి తప్పుకున్నారు. ట్విట్టర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) ఆడమ్ బైన్ సంస్థ నుంచి వైదొలగుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. వినియోగదారుల పెరుగుదల కోసం కృషి చేస్తున్న సమయంలో అడ్వర్టైజింగ్ బిజినెస్ బాగా పెంచిన ఆడమ్ ట్విట్టర్‌ను వీడడం కంపెనీకి ఎదురుదెబ్బే. ఆయన 2010లో ట్విట్టర్లో చేరారు. .ఆయన స్థానంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) ఆంటోనీ నోటో బాధ్యతలు స్వీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది.సీఎఫ్ఓ స్థానంలో కొత్త వ్యక్తిని నియమిమించనున్నట్లు పేర్కొంది. నష్టాల కారణంగా గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 9శాతం మందిని తొలగిస్తున్నట్లు గత నెలలోనే ట్విట్టర్ ప్రకటించింది. ఇటీవల ట్విట్టర్ ఇండియా హెడ్, మేనేజింగ్ డైరెక్టర్లు కూడా సంస్థ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







