విండిస్‌పై భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయం
- November 10, 2016
భారత మహిళల క్రికెట్ జట్టు విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. 132 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన మిథాలీ సేన 39.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 133 పరుగులు సాధించి జయకేతనం ఎగురవేసింది. భారత జట్టులో వేదా కృష్ణమూర్తి (52 నాటౌట్), మిథాలీ రాజ్(46 నాటౌట్) అజేయంగా నిలిచారు. దీప్తి శర్మ (16), స్మృతి మందన(7), మోనా మెష్రమ్ (2) పరుగులు చేశారు. విండీస్ జట్టులో సెల్‌మాన్ 2 వికెట్లు తీయగా మాథ్యూస్, ఫ్లెచర్‌లకు చెరో వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ 42.4 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది.విండీస్ జట్టులో అగులిరియా 42, మాథ్యూస్ 24 టేలర్ 19, మినహా మిగిలిన వారెవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేదు. భారత బౌలర్లలో ఆర్‌ఎస్ గైక్వాడ్ 4 వికెట్లు తీయగా, బిస్త్ మూడు, పాండే ఒక వికెట్ తీశారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







