పన్నులు, ఫీజులు ఏవైనా పాత నోట్లతో కట్టొచ్చు....
- November 10, 2016
పాత రూ.1,000, రూ.500 నోట్లను వినియోగించుకునేందుకు కేంద్రం మరో అవకాశం కల్పిం చిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. గ్రామ పంచాయతీ, మున్సిపాల్టీల్లో చెల్లించాల్సిన ఇంటి, ఆస్తి పన్నులు, నల్లా, కరెంటు బిల్లులు, పాత బకాయిలు, ఇతర పన్నులు, ఫీజులు ఏవైనా శుక్రవారం అర్ధరాత్రి వరకు చెల్లించవచ్చని గురువారం రాత్రి వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, కార్యాలయాలు అదనపు సమయాలు పని చేస్తాయని తెలిపారు. 'ఈ (గురువారం) ఉదయం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన సందర్భంలో రూ.500, రూ.1000 నోట్ల మార్పిడిపై ప్రజల స్పందనేమిటని నన్నడిగారు.మంచి నిర్ణయమేనని, అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ డిస్కమ్‌లు భారీ నష్టాల్లో ఉన్నాయని, వాటిని చెల్లించేందుకు ప్రజలకు వెసులుబాటు కల్పించాలని కోరాం.ఆయన సానుకూలంగా స్పందించారు. రద్దయిన నోట్లతో బిల్లులు కట్టొచ్చంటూ గెజిట్ విడుదల చేశారు' అని వివరించారు. 'రాష్ట్రంలోని మున్సిపల్, పంచయతీ అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేశాం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ పరిధిలో శుక్రవారం అన్ని కార్యక్రమాలనూ సస్పెండ్ చేశాం.మీ-సేవా, ఈ-సేవా కేంద్రాలు అందుబాటులో ఉంటారుు. చెల్లింపులకు రసీదు ఇస్తాం. ఈ పన్నుల రూ పేణా ప్రజలు చెల్లించే మొత్తం ఆదాయపు పన్ను పరిధిలోకి రాదు' అని స్పష్టం చేశారు. వాట్సాప్‌లో వెల్లువెత్తుతున్న వదంతులను నమ్మొద్దని సూచించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







