ఈనెల 14న అసాధారణ స్థాయిలో భారీ చంద్రుడు..

- November 10, 2016 , by Maagulf
ఈనెల 14న అసాధారణ స్థాయిలో భారీ చంద్రుడు..

ఈనెల 14న అసాధారణ స్థాయిలో భారీ చంద్రుడు, మరింత వెలుగులు విరజిమ్ముతూ ఆకాశంలో ప్రత్యక్షమవనున్నాడు. 68 ఏళ్లలో భూమికి అత్యంత సమీపంగా వచ్చే సూపర్‌మూన్‌గా ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణం అనుకూలిస్తే పూర్తిస్థాయి పరిమాణాన్ని ఆసియాలో వీక్షించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మేఘాలు, కాంతి కాలుష్యం లేకుండా ఉంటేనే చూడటం సాధ్యం. ఈసారి భూమి నుంచి 356,509 కి.మీ దూరంలో ఉండనుంది. చంద్రుడు సాధారణంకన్నా ప్రకాశవంతంగా ఉన్నట్లు సాధారణ పరిశీలనతోనే గుర్తించవచ్చని చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com