యుపిలో భారీ అగ్ని ప్రమాదం..

- November 11, 2016 , by Maagulf
యుపిలో భారీ అగ్ని ప్రమాదం..

భారీ అగ్ని ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. వీరంతా పేద కార్మికులు కావడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్‌ వస్త్ర మిల్లులో శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. అందులో నిద్రిస్తున్న వారిలో 13 మంది అగ్నికి ఆహుతయ్యారు. పలువురు గాయపడ్డారు.

12 అగ్నిమాపక వాహనాలు అతి కష్టం మీద మంటలను అదుపుచేశాయి. కేవలం ఇద్దరు కార్మికులను సిబ్బంది రక్షించగలిగారు. అందులో ఎంత మంది ఉన్నది తెలియకపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ వస్త్ర మిల్లును అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com