దుబాయ్ లో రక్షాబంధన్ వేడుకలు

- August 28, 2015 , by Maagulf
దుబాయ్ లో రక్షాబంధన్ వేడుకలు

దుబాయ్ లో రక్షాబంధన్ వేడుకలు్ ఘనంగా జరుపుకుంటున్నారు.ఆత్మీయతానురాగాలకు ప్రతీక... ఒకరికి మరొకరు తోడున్నారనే భరోసా... సోదర సోదరీమణుల బంధానికి నిలువెత్తు నిదర్శనం... రక్షాబంధన్. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న మన భారతీయ సంస్కృతిలోని ఓ అపురూపమైన వేడుక రాఖీ పండగ  అన్నా చెల్లెళ్ల అనురాగాలతో నిండిపోయాయి. ప్రతి ఏటా శ్రావణమాసపు పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటాం. మణికట్టుకు దారంతో బంధం వేసి... జీవితకాలపు అనుబంధాన్ని గుర్తుచేయడమే రక్షాబంధన్ గొప్పతనం. ఎలాంటి సమయంలోనైనా... తనకు రక్షగా అన్నయ్య ఉన్నాడన్న భరోసా సోదరిలో కనిపిస్తే.... తనకు ఆత్మీయతానురాగాలు పంచిపెట్టే సోదరి ఉందన్న భావాన్ని అన్నయ్యలో నింపుతుంది ఈ బంధనం. సోదరితో రాఖీ కట్టించుకుంటే అన్నయ్యకు.... సోదరితో రాఖీ కట్టించుకుంటే అన్నయ్యకు అన్నింటా విజయమే వరిస్తుందన్నది నమ్మకం. అన్నయ్యకు రాఖీ కడితే కష్టసుఖాలలో అండగా ఉంటాడన్నది ప్రతి ఆడపడచు విశ్వాసం. అందుకే నీకు నేను రక్ష, నాకు నీవు రక్ష అన్న అర్థంతోనే ఈ పండగ రక్షాబంధన్ గా పేరుతెచ్చుకుంది. అందుకే పల్లె నుంచి పట్నం దాకా ఒక్కటే సందడి నెలకొంది. వీధివీధినా రాఖీ షాపులు, ఫ్యాన్సీ షాపుల్లో హడావుడి కనిపిస్తోంది. ఆకర్షణీయమైన కానుకలు, అద్భుతమైన రాఖీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఒక్క  నిజానికి ఈ రాఖీ పౌర్ణమి వెనక గొప్ప చారిత్రక నేపథ్యమే ఉంది. చరిత్ర పుటల్ని తిరగేస్తే సోదరభావంతో కట్టే... ఈ రాఖీలు పెద్ద పెద్ద యుద్ధాలనే ఆపాయి. రక్తపాతాన్ని నివారించి, శాంతిమార్గానికి బాటకు వేశాయి.

 

--సి.శ్రీ(దుబాయ్)

 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com